కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 6వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇంతలో కేసీఆర్ కుటుంబం నుంచి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేటీఆర్ ట్విట్ చేశారు.

‘స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లాను. ఇటీవల తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్‌ నిబంధనలను పాటించాలి’ అని కేటీఆర్  ఆయన కోరారు. ఇక కేటీఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలిసి.. తెరాస శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆయన తర్వాత కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.