కొవిడ్‌ గుప్పిట్లో రాష్ట్రాలు

కరోనా మహమ్మారి దేశంలో మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత మూడ్రోజులుగా 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య 2వేలకు తగ్గడం లేదు. పట్టణాల్లోనే కాదు.. పల్లెలకు మహమ్మారి పాకింది. కొన్ని గ్రామాల్లో 50శాతం మంది కరోనా బారినపడ్డారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

మహారాష్ట్రను కరోనా పట్టి పీడిస్తోంది. తాజాగా అక్కడ 67,013 మందికి కరోనా సోకగా..568 మంది మరణించారు. దేశరాజధాని దిల్లీలో కరోనా ప్రతాపం చూపిస్తోంది. అక్కడ మరణాలు 306కి చేరుకున్నాయి. తాజాగా 26,169 మందికి వైరస్ సోకింది. ఉత్తర్‌ప్రదేశ్‌(34,254), కేరళ(26,995), కర్ణాటక(25,795) రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్రత ఎక్కువగానే ఉంది. చత్తీస్‌గఢ్‌లో 207 మంది ప్రాణాలు వదిలారు. ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6,206 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 29 మంది కరోనాతో మృతిచెందారు.