పవన్-అలీని దగ్గర చేసిన దర్శకుడు ఎవరు ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో అలీ ఉండాల్సిందే. అసలు అలీ లేకపోతే నేను సినిమా చేయలేనని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి ప్రేమ ద‌గ్గ‌ర్నుంచి కాట‌మ‌రాయుడు వ‌ర‌కూ.. వీళ్ల కాంబినేష‌న్ బాగా వ‌ర్కవుట్ అయ్యింది. అయితే వీరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాటా మాటా అనుకున్నారు. దానికి రాజకీయరంగు పులుముకొని.. కాస్త పెద్దగా అనిపించింది. పవన్-అలీ మధ్య గ్యాప్ పెరిగింది. అయితే ఇటీవల ఆ గ్యాప్ తగ్గింది. పవన్ ని అలీ కలిశారు. మాటలు కలిశాయి అనే వార్తలు వినిపించాయి.

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? అది నిజమే. అంతేకాదు.. మళ్లీ పవన్ సినిమాలో అలీ కనిపించనున్నారు. ఈమ‌ధ్య పవన్ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమాలో అలీకి ఓ మంచి పాత్ర ప‌డింద‌ట‌. ఆ పాత్ర అలీ చేస్తేనే బాగుంటుంద‌ని ప‌వ‌న్ ద‌ర్శ‌కుడికి స‌ల‌హా ఇచ్చిన‌ట్టు. దాంతో అలీ ఖ‌రారైన‌ట్టు సమాచారమ్. ఇంతకీ ఆ పాత్రని అలీనే చేస్తే బాగుంటుందని పవన్ దగ్గర బలంగా చెప్పిన దర్శకుడు ఎవరు ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బహుశా.. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ అయి ఉంటారేమో.. ! గబ్బర్ సింగ్ కాంబోలో త్వరలోనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని.. తండ్రి-కొడుకుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.