ధోని చేతిలో కోహ్లీ.. చిత్తు చిత్తు !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, తాజా కెప్టెన్ విరాట్ కోహ్లీ తలపడ్డారు. ఐపీఎల్ 14 ఇందుకు వేదికైంది. చెన్నై వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(33; 25 బంతుల్లో 4×4, 1×6), డుప్లెసిస్‌(50; 41 బంతుల్లో 5×4, 1×6) శుభారంభం చేశారు. ఆపై సురేశ్‌ రైనా(24; 18 బంతుల్లో 1×4, 3×6), రవీంద్ర జడేజా(62*; 28 బంతుల్లో 4×4, 5×6) దంచికొట్టారు.

192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించడమే కాదు, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇక ఈ మ్యచ్ లో చెన్నై ఇన్నింగ్స్ హర్షల్‌ పటేల్ వేసిన చివరి ఓవర్ హైలైట్. ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్‌ రన్‌తో పాటు ఒక నోబాల్‌ పడటంతో మొత్తం 37 పరుగులు సాధించాడు జడేజా.