పవన్ తో దిల్ రాజు మరో సినిమా !

‘వకీల్ సాబ్’తో తన చిరకాల కోరికని తీర్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. పవన్ తో సినిమా చేయాలన్నది ఆయన 22యేళ్ల. ఆ కల వకీల్ సాబ్ తీరినందుకు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ ముందే, ఆ తర్వాత సినిమా రిలీజ్ తర్వాత నిర్వహించిన సినిమా ప్రమోషన్స్ లోనూ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కూడా ఇన్నాళ్లు దిల్ రాజుతో సినిమా చేయనందుకు బాధగా ఉందన్నారు. బహుశా.. అందుకేనేమో.. దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 

ఈ సినిమాకు  ఓ తమిళ దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఆయనతో కుదరకపోతే తెలుగులోనే విజయవంతమైన చిత్రాలను రూపొందించిన మరో దర్శకుడితో తీస్తారని టాక్‌ వినపడుతోంది. ఇది పవన్‌ ఇమేజ్‌కు తగిన కథ అని చెబుతున్నారు. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయిస్తున్నారట. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇప్పటికే పవన్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌తో పాటు ‘హరి హర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేశారు. ఇవి పూర్తయిన తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ఉండే అవకాశాలున్నాయి.