ఐపీఎల్ 2021 : పంజాబ్ పై కోల్ కతా విజయం

కోల్ కతా మెరిసింది. పంజాబ్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్‌ 3, నరైన్‌, కమిన్స్‌ 2 వికెట్లు, శివమ్‌ మావి, చక్రవర్తి చెరో వికెట్‌ పడగొట్టారు. 


అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌ త్రిపాఠి(41; 32 బంతుల్లో 7×4), ఇయాన్‌ మోర్గాన్‌(47 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 2×6) కీలకంగా ఆడారు. 17 పరుగులకే నితీశ్‌రాణా(0), శుభ్‌మన్‌గిల్‌(9), సునీల్‌ నరైన్‌(0) పెవిలియన్‌ చేరిన దశలో త్రిపాఠి, మోర్గాన్‌ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 48 బంతుల్లో 66 పరుగులు జోడించి కోల్‌కతాను తిరిగి రేసులో నిలిపారు. చివర్లో దినేశ్‌కార్తీక్‌(12నాటౌట్‌; 6 బంతుల్లో 2×4)తో జోడీ కట్టిన మోర్గాన్‌ కోల్‌కతాకు రెండో విజయాన్ని అందించాడు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌, షమి, అర్ష్‌దీప్‌, దీపక్‌ హుడా తలా ఓ వికెట్‌ పడగొట్టారు.