ఖుషి @20 ఇయర్స్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషి బిగ్గెస్ట్ హిట్. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్-భూమిక జంటగా నటించారు. ఏప్రిల్ 27, 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖుషి బ్లాక్ బస్టర్ హిట్టైంది. రికార్డులని తిరగరాసింది. యూత్ కి పిచ్చెక్కించిన సినిమా ఇది. ఆ తర్వాత పవన్ ఖాతాలో వరుసగా ప్లాపులు పడినా.. ఆయనపై అభిమానం చానివ్వని సినిమా ఖుషి. ఖుషిలోని బొడ్డు సీన్ గురించి ఎంత చెప్పినా.. తక్కువే. అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పటికీ పవన్ ఖుషి టీవీల్లో వస్తే.. టీఆర్పీ రేటింగ్స్ అదుర్సే. 

ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు నిండాయి. ఈ స్పెషల్ డేని పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఖుషి పోస్టర్స్ తో హోరెత్తిస్తున్నారు. ఖుషి చేసుకుంటున్నారు. ఇక ఖుషి తర్వాత పవన్ కు ఆ రేంజ్ లో పేరు తెచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ మరోసారి ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేసిన సినిమా ఇది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన వకీల్ సాబ్ ది అదే రేంజ్. పవన్ కెరీర్ లో తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్.. ఆణిముత్యాలు. అంతే.