ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. ఒకే అంబునెల్స్ లో 22 మృతదేహాలు !

కరోనా సెకండ్ వేవ్ దేశంలో కాష్టాల గడ్డని తలపిస్తొంది. శనిపోయిన వారికి లారీల్లో లోడ్ల మాదిరిగా అంబులెన్స్ లో ఇరికించి తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కరోనా మృతదేహాలను అధికారులు ఒకే ఒక్క అంబులెన్సులో కుక్కి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా మృతదేహాలను తీసుకెళ్లారు. దీనిపై ఆసుపత్రి వర్గాలని ప్రశ్నిస్తే..  ‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం?’ అని చెప్పారు.