AP ఏపీలో గంటకు 411 కొత్త కేసులు.. TSలోనూ అదే సీను !
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో గంటకు దాదాపు 411 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి. కాకపోతే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్యని దాస్తున్నారనే విమర్శలున్నాయి. స్మశానవాటికల్లో రోజుకు వందల శవాలని కాలుస్తుంటే.. ప్రభుత్వం నివేదికల్లో మాత్రం పదుల సంఖ్యల్లోనే చూపిస్తున్నారు.
ఇక ఏపీలో ఐదు రోజుల్లోనే (ఏప్రిల్ 22-26) 56,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదట్లో 50 వేల కేసులు నమోదయ్యేందుకు 17 రోజుల (1-17) సమయం పట్టింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 9,881 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మహమ్మారి బారిన పడిన వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు.మార్చి ఆఖరు వరకూ ఓ మోస్తరుగా నమోదైన కేసులు ఏప్రిల్ 1 నుంచి నెమ్మదిగా పెరిగాయి. 15 తర్వాత ఉద్ధృతమయ్యాయి. వైరస్ వ్యాప్తి వేగం, తీవ్రత బాగా పెరిగాయి. క్రియాశీలక కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది.