బ్రేకింగ్ : అల్లు అర్జున్’కి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యులు, స్టార్స్.. అందరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరికాసేపట్లో బన్నీ ట్విట్ చేస్తారని తెలిసింది. 

ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కరోనా ఉదృతి తీవ్రంగా ఉన్నా.. బ్రేక్ ఇవ్వలేదు. పుష్ప సినిమా షూట్ ను నిర్విరామంగా చేస్తున్నారు. అయితే ఈ మధ్య బన్నీ షూటింగ్ కు వెళ్లలేదు. కమెడియన్ సునీల్ సీన్లు అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. కానీ అంతకు ముందు వెళ్లిన ఫలితమో లేదా మరెవరి ద్వారానో సోకిందో కానీ మొత్తానికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.ఫ్రస్తుతం బన్నీ ఐసోలేషన్ లో వుంటున్నారని తెలుస్తోంది.