TSలో 8061 కొత్త కేసులు, 52 మరణాలు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8061 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 2150కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 72,133 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1508 కేసులు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలకు సమాచారమ్ అందించినట్టు చెబుతున్నారు. దాదాపు 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించబోతున్నట్టు తెలుస్తోంది. ఆఖరి అస్త్రంగా మాత్రమే లాక్ డౌన్ ఉండాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో అదే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ని ఆశ్రయించక తప్పడం లేదని తెలుస్తోంది.