టీఆర్ఎస్ సిట్టింగులు, సీనియర్లు.. తట్టాబుట్టా సర్థుకోండి !

ఆపర్షన్ ‘ఈటెల’ సక్సెస్ ఫుల్ గా పూర్తిగా చేశారు సీఎం కేసీఆర్. కేవలం 24 గంటల్లో కథని ముగించారు. బహుశా.. దేశ చరిత్రలోనే ఇంత స్పీడుతో ఓ సీనియర్ నేత, ఓ ఉద్యమ నేత బతుకు బజారున పడి ఉండదు. అదే.. కేసీఆర్ రాజకీయ వ్యూహం అనుకోవాలేమో. లేకపోతే ఆయనకు తనయుడు కేటీఆర్ పై ఉన్న అమితప్రేమ అనుకోవాలేమో. ఎందుకంటే ? కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారు. దానికి.. రెండే రెండు అడ్డంకులు. ఒకటి ఈటెల రాజేందర్, హరీష్ రావు. అందుకే.. టీఆర్ ఆర్ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత వీరిద్దరి పక్కనపెట్టాలనే.. ఇంకా చెప్పాలంటే తొక్కేయాలనే ప్రయత్నాలు జరిగాయి. హరీష్ రావుకు మొదటి దఫాలో మంత్రి పదవి దక్కలేదు. 

ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అసంతృప్తిని చూసి హరీష్ రావుని క్యాబినేట్ లోకి తీసుకోక తప్పలేదు. ఇది పక్కనపెడితే.. ఇటీవల కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనే వార్తలు వచ్చిన టైమ్ లో ఈటెల, హరీష్ అసంతృప్తిలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. హరీష్ ఎక్కడా.. తన అసంతృప్తిని బయటపడనీయలేదు. కానీ ఈటెల టైమ్ వచ్చినప్పుడల్లా ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తామే అసలైన గులాభి ఓనర్లమని ఓ సందర్భంలో ఆయన అన్నారు కూడా.

ఈ నేపథ్యంలో.. కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలంటే ఈటెలని పంపించక తప్పదని డిసైడ్ అయిన సీఎం కేసీఆర్.. ఆయనపై  విజయవంతంగా బదనాం వేసి.. బయటికి పంపే ప్రయత్నం చేశారు.
ఈటెలపై చర్యలతో మంత్రి హరీష్ రావుకు ఝులక్ ఇచ్చినట్టయింది. ఆయన ఇప్పుడు కేటీఆర్ సీఎం చేసినా. మాట కూడా అనలేని పరిస్థితి. హరీష్ ఒక్కరే కాదు.. ఇప్పుడు మంత్రులు, సీనియర్లు అందరు గప్ చుప్. ఎవరు నిరసనగళం  వినిపించినా.. ఈటెల గతే.

ఆపరేషన్ ఈటెల వెనక మరో బృహత్ కార్యాన్ని కూడా సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. అదేంటంటే.. ? వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు, మంత్రులకు నో సీట్లు అనే క్లారిటీ కూడా ఇచ్చేశారు. గత ఎన్నికల్లో తెరాసకు సీట్ల సంఖ్య తగ్గడానికి కారణం సిట్టింగులకు సీట్లు ఇవ్వడమే. అయితే అదే తప్పిదం 2023 ఎన్నికల్లో చేయట్లేదని సీఎం కేసీఆర్ చెప్పేశారు. రెండేళ్ల ముందే వారు మళ్లీ టికెట్ అడటానికి భయం పెట్టారు. ఆయనకి ఇష్టం వచ్చిన ఓ నలుగురైదుగురు సిట్టింగులు ఇస్తే ఇవ్వొచ్చు.

మొత్తానికి.. ఒకే దెబ్బకు.. మూడు పిట్టలని కొట్టేశారు సీఎం కేసీఆర్. కాకపోతే.. ఉద్యమంలో అతి కీలకంగా వ్వవహరించిన ఈటెల మీద.. ఇలా కక్ష్యగట్టడం మాత్రం తెలంగాణ ప్రజానీకం హర్షించడం లేదు. బహుశా.. ఈ అన్యాయంపై తిరగబడి బీసీలు ఒక్కటైతే.. భవిష్యత్ లో టీఆర్ ఎస్ కు నష్టం తప్పకపోవచ్చేమో.. !