‘వకీల్ సాబ్’పై ఓ ఫిర్యాదు

వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ థియేటర్స్ సందడి చేశారు. వసూల్ సాబ్ అనిపించుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాడు. భారీ లాభాలు కూడా వచ్చాయ్. ఇప్పుడు ఓటీటీలోనూ వకీల్ సాబ్ హవా చూపిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ అదరగొడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో వకీల్ సాబ్ పై ఓ ఫిర్యాదు అందింది.

సినిమాలో కథానాయిక అంజలికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా మార్చినట్లు సినిమాలో ఓ సన్నివేశం ఉందని, అందులో అంజలి ఫోటో కింద తన ఫోన్‌ నంబరు ఉండటం వల్ల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిరంతరం ఫోన్లు వస్తున్నాయని సుధాకర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. చిత్ర యూనిట్‌ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు.