మాల్దీవులకు ఆసీస్ ఆటగాళ్లు`
ఐపీఎల్2021 నిరవధికంగా వాయిదా పడటంతో అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ? భారత్ నుంచి సాగే రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15వరకు తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందిని మాల్దీవులకు తరలించించారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా కాసేపటి క్రితం ఓ ట్వీట్ చేసింది. ఐపీఎల్‌తో సంబంధమున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు, వ్యాఖ్యాతలు, ఇతర సిబ్బంది అందర్నీ క్షేమంగా మాల్దీవులకు తరలించాము. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరిస్తోంది. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తాత్కాలికంగా విధించిన ప్రయాణ ఆంక్షలు సడలించేవరకు వారంతా అక్కడే ఉంటారని పేర్కొంది. ఆంక్షలు ముగిసిన తర్వాత వారిని దేశంలోకి అనుమతి ఇవ్వనున్నారు.
Official Update | We can confirm that Australian players, coaches, match officials and commentators have been safely transported from India and are en route to the Maldives. pic.twitter.com/mZQT2RlvBv— Cricket Australia (@CricketAus) May 6, 2021