ఏపీలో ఎన్‌440కె వైరస్‌ లేదట

తెలుగు రాష్ట్రం ఏపీలో ఎన్‌440కె వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఏపీలో.. ముఖ్యంగా కర్నూలు జిల్లాల్లో కరోనా మృతుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి  షేర్ని నాని స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్‌ లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ఎన్‌440కె వైరస్‌ ఉన్నట్లు నిర్ధరణ జరగలేదన్నారు. రాష్ట్రంలో కొత్త రకం వైరస్‌ లేదనే విషయాన్ని నిపుణులే చెబుతున్నారన్నారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుంది. పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ అందుబాటులో ఉన్నాయని.. ఆల్ ఈజ్ వె అని మంత్రి చెప్పుకొచ్చారు.