ఏపీలో 73 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 17,188 కొత్త కేసులు నమోదయ్యాయ్. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్‌ బారినపడ్డారు.

గత 24 గంటల్లో కరోనాతో 73 మంది మృతి చెందారు. విజయనగరంలో 11మంది మృతి చెందగా, విశాఖ 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, గుంటూరు 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరి 5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, అనంతపురంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా 12,749మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 10,50,160మంది కరోనా నుంచి బయటపడ్డారు.