చంద్రబాబుకు అరెస్ట్ హెచ్చరికలు
కరోనా విజృంభిస్తున్న టైమ్ లో అసత్యాలని ప్రచారం చేయడం నోరం, ఘోరం కూడా. సాధారణ ప్రజల విషయం పక్కనపెడితే.. ప్రతిపక్షంలో ఉన్న వారు ఇంకా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మాత్రం.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది. కరోనా పరిస్థితులు చేయి దాటిపోయాయ్. కర్నూలులో కొత్తరకం వైరస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. దాని పట్ల ప్రభుత్వం ఏమాత్రం అప్రమత్తంగా లేదంటూ.. కామెంట్స్ చేసింది.
ఇప్పుడీ.. ఈ వ్యాఖ్యలు విమర్శలకు తావునిస్తున్నాయి. అసత్య ప్రచారం చేస్తున్న చంద్రబాబుని అరెస్ట్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఇక శనివారం మీడియా ముందుకొచ్చిన మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు, తెదేపా నేతల ప్రచారాన్ని ఏకిపారేశారు. కర్నూలు జిల్లా నుంచి ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి అంటూ భయపెడుతున్నారని .. ప్రజలను భయపెట్టేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తెదేపా జూమ్ మీటింగ్‌లపైనా నిఘా సంస్థలు కన్ను వేయాలని ఆయన కోరారు. మొత్తానికి.. కోవిడ్ పై అసత్య ప్రచారం విషయంలో చంద్రబాబుకు అరెస్ట్ హెచ్చరికలు చేసినట్టు అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిమితి మేరకే కరోనా టీకాలు అందుబాటులో ఉంచిందని వివరించారు. టీకాల కోసం రూ.1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే 10 లక్షల డోసులు వేయించేందుకు సిద్ధం అని మంత్రి అన్నారు. చంద్రబాబు, ఇతర నాయకుల రాజకీయ విమర్శలు సరికాదు అని మండిపడ్డారు.