ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి : మహేష్
కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో.. మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు సినీ ప్రముఖులు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా కరోనా సూచనలు, సలహాలు చేశారు.
“రోజు రోజుకీ కొవిడ్-19 తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి. ఒకవేళ కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో పరిశీలన చేసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీని ద్వారా అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి” అంటూ మహేష్ ట్విట్ చేశారు.
ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. బ్యాకింగ్ కుంభకోణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని చెబుతున్నారు. కరోనా విజృంభణతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you’re around people and step out only if it’s absolutely necessary!— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021