కడప ఘటనపై పవన్ దిగ్భ్రాంతి

కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో తిరుమల కొండ సమీపంలోని బైరటీస్ గనుల్లో జిలెటిన్‌స్టిక్స్ పేలడంతో 10 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గని యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.