‘పుష్ప’ పార్ట్ వన్ రిలీజ్ డేటు ఫిక్స్ ?

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సినిమా లెక్కలు మళ్లీ మారాయ్. రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయ్. సినిమాల షెడ్యూల్స్ మారాయి. సెకండ్ వేవ్ విజృంభణ తగ్గి.. మళ్లీ మాములు పరిస్థితులు ఏర్పడితే గానీ.. ఏ సినిమా ఎప్పుడు ? అనే క్లారిటీ రానుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ చిత్రం పుష్ప.. ఈ యేడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ సూపర్ స్కెచ్ వేశారని.. పుష్పని రెండో భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు.. పుష్ప పార్ట్ వన్ రిలీజ్ డేటుని కూడా చెప్పేస్తున్నారు. అక్టోబర్ 13న పుష్ప-1 రిలీజ్ కాబోతుందని లెటెస్ట్ సమాచారమ్. సినిమాలో కథ రెండు భాగాలుగా వుంటుంది. ఎర్రచందనం రవాణా కూలీగా ప్రారంభమై డాన్ గా ఎదిగిన హీరో కథ. తొలిసగం అంతా రఫ్ గా రగ్డ్ గా సాగుతుంది. డాన్ గా ఎదిగిన తరువాత అల్ట్రా స్టయిలిష్ గా వుంటుంది. పైగా కీలకమైన నటుడు ఫాజిల్ పోషిస్తున్న అటవీ రేంజర్ పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ టైమ్ కు కానీ ఎంటర్ కాదని తెలుస్తోంది. తొలిభాగాన్ని అక్టోబర్ 13న విడుదల చేస్తే ఎలా వుంటుందని కూడా లెక్కలు కడుతున్నారు. తొలి భాగం ఫినిష్ చేయాలన్నా కనీసం 25 రోజులు పైనే షూట్ చేయాల్సి వుందట. త్వరలోనే పుష్ప రెండు భాగాల రిలీజ్ పై పూర్తి క్లారిటీ రానుంది.