‘పార్ధు’ అంటే ఎందుకిష్టం ?

దర్శకుడు త్రివిక్రమ్ ఓ టైటిల్ ని జాగ్రత్తగా దాచుకున్నాడు. ‘అతడు’ సినిమా నుంచి ఆ టైటిల్ ని దాచుకోవడం విశేషం. అతడులో మహేష్ బాబు పాత్ర పేరు ‘పార్థు’. అప్పటి నుంచి పార్థు అనే టైటిల్ ని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు దాన్ని రినివల్ చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఆ టైటిల్ ని చాలా మంది అడిగారట. కానీ త్రివిక్రమ్ ఇవ్వలేదు. ఆ మధ్య నాగశౌర్యతో తీసే లక్ష్య సినిమా కోసం ఇదే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఇవ్వడానికి త్రివిక్రమ్ ఓకె అనలేదు. ఎందుకంటే ? పార్థు అంటే త్రివిక్రమ్ కి బాగా ఇష్టం.

అతడు సినిమాలో మహేష్ పేరు అని కాదు. త్రివిక్రమ్ కు ఇష్టమైన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి. ఆమె నవలల్లో ఒకటి పార్ధు. అప్పటి నుంచే ఆ పేరు ఆయనకు ఇష్టం. ఆ పేరునే అతడు సినిమాలో మహేష్ కు వాడారు. ఇప్పుడు మళ్లీ ఆయన కోసమే పార్థు టైటిల్ ని వాడబోతున్నట్టు సమాచారమ్. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పార్థు అని సమాచారమ్.