ఏపీలో 22వేల కొత్త కేసులు
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 22,164 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదవ్వగా.. మరణాలు 8,707కి పెరిగాయి. తాజాగా 8,832 మంది వైరస్ నుంచి కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు, సరఫరాకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.310కోట్లు కేటాయిస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వేల అదనపు ఆక్సిజన్ పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.