గుడ్ న్యూస్ : ఏపీలో 49 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు

కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక జనాలు మృతి చెందుతున్నారు. తగినంత ఆక్సిజన్ ఉంటే.. కరోనా మరణాలని దాదాపు తగ్గించవచ్చు. జీరో చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు, సరఫరాకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ మేరకు రూ.310కోట్లు కేటాయిస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వేల అదనపు ఆక్సిజన్‌ పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.