కేసీఆర్ కరోనా సలహాలకు ప్రధాని ఫిదా

కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా కట్టడిపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులపై అధికారులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన సమీక్షలో కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై భేటీలో చర్చించారు. 2,3 నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపదికన వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు.

ఇక సమీక్ష అనంతరం ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్‌ సూచనలు బాగున్నాయని, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తనకు వివరించారని మోదీ తెలిపారు. వాటిని ఆచరణలో పెడతామన్నారు. మంచి సూచలను చేసినందుకు కేసీఆర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాల సరఫరాను పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు.