మంత్రి కొప్పులకు కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న రాజకీయ ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్స్ లో ఉన్నా. ఇటీవల తనని కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండని మంత్రి కోరారు.
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బాగా వినబడిన పేర్లలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒకరు. ఈటెల వ్యవహారంలో పార్టీ, ప్రభుత్వం తరుపున తొలిసారి స్పందించారు కొప్పుల ఈశ్వర్. ఆయనతో పాటు మరో మంత్రి గంగుల కమలాకర్ ఈటెలపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. కొప్పుల, గంగుల, వినోద్ రాంగ్ రూట్లో టీఆర్ ఎస్ భవన్ లోకి చేరుకోవడం కూడా వైరల్ అయింది.