తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందివ్వాలని నిర్ణయించారు. దీనిని రెండు నెలల పాటు కొనసాగించనున్నారు.
ప్రయివేటు టీచర్ల విషయంలోనూ కేసీఆర్ పెద్ద ఆలోచన చేశారు. రాష్ట్రంలోని దాదాపు 1.2లక్షల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్న నేపథ్యంలో మరో 80 వేల మందికి కూడా ఈ సాయాన్ని అందించాలని సీఎం నిర్ణయించారు.