‘లైగర్’ టీజర్ విడుదల వాయిదా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘లైగర్’ టీజర్ వస్తుందని అభిమానులు ఆశించారు. చిత్రబృందం కూడా టీజర్ రిలీజ్ చేయాలని భావించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ పరిస్థితుల్లో లైగర్ టీజర్ విడుదలని వాయిదా వేశామని నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్విట్ చేశారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ తెరకెక్కుతోంది. అనన్యపాండే హీరోయిన్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా లైగర్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన లైగర్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడనుందని సమాచారమ్.

ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. విజయ్ అరుదైన ఫోటోలు, వీడియోలని షేర్ చేస్తున్నారు. కొందరు అభిమానులు విజయ్ పై ఉన్న ప్రేమని చాటుకుంటున్నారు. స్వయంగా విజయ్ స్కెచ్ వేస్తున్నారు. అవి అద్భుతంగా ఉంటున్నాయి.

Somethings can wait till all of us and our families are safe and happy..

When we get there we will celebrate! Everything!

I am thinking about you and your dear ones, stay sharp, stay safe 🤍🤗

Love,
Vijay https://t.co/zDI9Dvp03F
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2021