లాక్‌డౌన్‌ మరో వారం పొడిగింపు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. కొత్త కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఐతే అందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. లాక్‌డౌన్‌ వ్యవహారాన్ని రాష్ట్రాల చేతుల్లోకి వదిలేసి చేతులు దులిపేసుకొంది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలని కాపాడటం బాధ్యతగా భావిస్తున్న కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆశ్రయించాయి. ఆశ్రయిస్తున్నాయి.

ఇప్పటికే ఢిల్లీలోని క్రేజీవాల్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించారు. ఈ నెల17 వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ మరింత కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. మెట్రోసేవలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయని  తెలిపారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు కాస్త తగ్గినప్పటికీ.. లాక్‌డౌన్‌ కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.