బన్నీకి చరణ్ దంపతుల గ్రీటింగ్ కార్డ్

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న బన్నీకి ఇటీవల పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు దేవుణ్ని కోరుకుంటున్నారు.

తాజాగా బన్నీ కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ.. చరణ్‌ దంపతులు ఓ గ్రీటింగ్‌ కార్డు ఆయనకు పంపించారు. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, పండ్లు ఇతర సామగ్రిని సైతం ఆయనకు కానుకగా చెర్రీ పంపించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చరణ్‌ దంపతులకు బన్నీ థ్యాంక్స్‌ చెప్పారు.