రస్మిక లేటు విషెస్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజున ఆయన అభిమానులకు రెండు విషయాలు తీవ్రంగా నిరాశని కలిగించాయి. మొదటిది ‘లైగర్’ టీజర్ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో లైగర్ టీజర్ విడుదలని వాయిదా వేశామని చిత్రబృందం ప్రకటించింది. ఇక రెండోది.. విజయ్ బర్త్ డే రోజున రస్మిక నుంచి విషెస్ రాలేదు. రాత్రి వరకు రాలేదు. దాదాపు రాత్రి 8గంటల ప్రాంతంలో రస్మిక ట్విట్టర్ వేదికగా విజయ్ ని విష్ చేసింది.
“సారీ.. ఆలస్యమైంది. సూపర్ స్టార్ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘Only and only happiness to you’ ” అంటూ ట్విట్ చేసింది. విజయ్ తో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది. దీంతో.. విజయ్, రస్మిక ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కానీ విజయ్ ని విష్ చేయడానికి రస్మిక ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్టు ? అంటూ అప్పటికే డిస్కషన్స్ మొదలైపోయాయ్. బహుశా.. రస్మిక పొద్దున నుంచి బిజీగా ఉన్నారేమో.. !
విజయ్-రష్మిలది హిట్ కాంబో. వీరిద్దరు తొలిసారి ‘గీత గోవిందం’ కోసం జతకట్టారు. అందులో వీరి మధ్య కెమెస్ట్రీ హైలైట్ గా నిలిచింది. రస్మిక చుట్టూ.. విజయ్ మేడం మేడం అంటూ వెంటపడటం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రెడ్ కోసం మరోసారి వీరిద్దరు జతకట్టారు. ఈ సినిమాలోనూ వీరి మధ్య కెమెస్ట్రీ హైలైట్. అప్పటి నుంచే వీరిద్దరి మద్య ఏదో జరుగుతుంది అనే ప్రచారం కూడా ఉంది. ఒకట్రెండు సార్లు రస్మిక విజయ్ ఇంట్లో కూడా కనబడటం విశేషం. ఇక ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకడితే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఇటీవలే ఓ యాడ్ కోసం వీరిద్దరు జతకట్టారు. కానీ సినిమాలో పూర్తిస్థాయిలో రొమాన్స్ చేస్తే చూడాలన్నది అభిమానుల కోరిక. మరీ.. అదెప్పుడు తీరుతుందో చూడాలి.
Sorry ‘m late.. happiest birthday Superstar 🌸 @TheDeverakonda
Only and only happiness to you. 🤍 pic.twitter.com/oAPxOFYiG4— Rashmika Mandanna (@iamRashmika) May 9, 2021