భద్రకాళిగా సాయిపల్లవి

సాయిపల్లవి.. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే. కానీ ఆమె క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్.. అంతకుమించి. సాయి పల్లవి కమర్షియల్ కాదు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకొనే రకం అస్సలు కాదు. తనకు కథ నచ్చకపోతే.. పాతికకోట్లు ఇస్తామనన్నా సినిమా చేయదు. కాసులు ఇస్తున్నారుగా అని.. టన్నుల కొద్ది మేకప్ వేసుకోదు. పక్కింటి అమ్మాయిలా సింపుల్ గా ఉంటుంది. కానీ నటనలో మాత్రం ఆడసింహం. పాత్రలో లీనైపోతుంటుంది. గర్జిస్తుంటుంది. ఎంతలా అంటే.. ఆమె సినిమాలో ఆమె హీరో అన్నంతగా.

ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా ఆమె తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్ సినిమా నుంచి సాయిపల్లవి ఫస్ట్ లుక్ బయటకు వదిలారు. ఇందులోభద్రకాళి గెటప్ లో విశ్వరూపం చూపించింది.  శ్యామ్ సింగరాయ్ సినిమాలోని రెండు ఎపిసోడ్లలో ఓ ఎపిసోడ్ లో సాయిపల్లవి హీరొయిన్. ఈ ఎపిసోడ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. ఇప్పుడు వదిలిన లుక్ కూడా అదే విషయం రివీల్ చేస్తోంది. బెంగాల్ సంస్కృతి ప్రతిబింబించేలా కలర్, కట్టు, అంతా అచ్చుగుద్దినట్లు దింపేసారు.శూలం చేత పట్టి, ఎర్రటి చీర కట్టి సాయిపల్లవి అచ్చం కలకత్తా కాళిక లా దర్శనమిచ్చింది. సాహు గారపాటి నిర్మించే ఈ సినిమాకు దర్శకుడు రాహుల్.