TNR ఆరోగ్య పరిస్థితి విషమం ?

టాలీవుడ్ లో టీఎన్నార్ అంటే తెలియని వారు దాదాపు ఉండరు. పాత్రికేయుడు, న‌టుడు టీఎన్నార్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారమ్.  కొద్ది రోజుల క్రింద‌ట ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రు క‌రోనా బారీన ప‌డ్డారు. అలా.. టీఎన్నార్ కీ క‌రోనా సోకింది. దీంతో ఆయన వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకున్నారు. కోలుకున్నట్టే కనిపించారు. ఐతే ఉన్నట్టుంది ఆరోగ్యం తిరగబడింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారమ్.

టీఎన్నార్ టాక్ షో ఎంత ఫేమస్సో తెలిసిందే. స్టార్ నటీనటుల నుంచి చిన్నా చితకా నటీనటులని ఆయన ఇంటర్వ్యూ చేశారు. న‌టుడిగానూ మారారు. ఇటీవల నటుడిగా ఆయన మరింత బిజీ అయ్యారు. ఇంతలో ఆయన కరోనా బారినపడినపడటం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడం.. ఆయన స్నేహితులు, అభిమానుల్లో  ఆందోళన కలిగిస్తోంది. టీఎన్నార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.. !

TNR కరోనా తో Critical Condition లో వున్నారు. pic.twitter.com/cul0z2jhxw— Suresh Kondeti (@santoshamsuresh) May 9, 2021