బిగ్ బీ రూ.2కోట్ల విరాళం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నియంత్రణకు చర్యల కోసం భారీ విరాళం ప్రకటించారు. ఢిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న గురు తేజ్‌బహదూర్ కరోనా సంరక్షణ కేంద్రానికి రూ.2కోట్ల విరాళం ప్రకటించారు.
దేశంలో కరోనా పరిస్థితులు చూసి.. సినీ, క్రీడా ప్రముఖులు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు కరోనా కట్టడి కోసం తమవంతు సాయం చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా కరోనా కోసం భారీ మొత్తంలో విరాళం అందించిన సంగతి తెలిసిందే.