తారక్ కు కరోనా పాజిటివ్
కరోనా ఎవ్వరినీ వదలడం. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తారక్ ట్విట్ చేశారు.
“కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్‌విజన్‌లోనే ఉన్నాం. నాతో కొద్ది రోజుల క్రితం వరకూ కలిసిన వారంతా టెస్టులు చేయించుకోండి. సేఫ్ గా ఉండండి” అంటూ రాసుకొచ్చారు.
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తారక్ తన వంతు కృషి చేశారు. మాస్క్ పెట్టుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి. వైరస్ వ్యాప్తిని అడ్డుకుని దేశాన్ని కాపాడంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి తారక్ కూడా కరోనా బారినపడటం బాధకరం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. దేవుడ్ని ప్రార్థిద్దాం.
ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో తారక్ కొమరంభీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. ఇంటివద్దే ఉంటున్న తారక్ కి కరోనా ఎలా సోకింది ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నే.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe</p>— Jr NTR (@tarak9999) <a href=”https://twitter.com/tarak9999/status/1391686192760987651?ref_src=twsrc%5Etfw”>May 10, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>