నయన్ జీవితంలో.. ఆ భాగ్యం లేదట !

స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ.. పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ నే. యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఐదారేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉంది. నయన్ కు ఇదే తొలి ప్రేమకథ కాదు. అంతకుముందు కోలీవుడ్ హీరో శింబు, ఆ తర్వాత నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతోనూ ప్రేమాయణం నడిపించింది.

వారితో విడిపోయాక విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. ఈ జంట పెళ్లి చేసుకోలేదు. కానీ కలిసే జీవిస్తున్నారు. సహజీవనం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు ఈ జంట విడిపోయిందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అందులో నిజం లేదని.. ఫారిన్ లోకేషన్స్ లేదా ఇంట్లో సన్నిహితంగా దిగిన ఫోటోలతో ఈ జంట సమాధానాలు ఇస్తుంటుంది.

మొదట్లో పెళ్లి చేసుకోమని విగ్నేష్ శివన్ ని నయన్ తొందరపెట్టేదట. అందుకు విగ్నేష్ మాత్రం నో చెబుతూ వస్తూ ఉండేవాడట. తనకి నయన్ ఇంకా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు నయన్ యూటర్న్ తీసుకుంది. విఘ్నేష్ తో పెళ్లికి నో చెబుతోందని లెటెస్ట్ టాక్. ఎందుకు ? నయన్ కు విఘ్నేష్ బోర్ కొట్టాడా అంటే… ? కాదట. అసలు నయన్ జీవితంలో పెళ్లి భాగ్యమే లేదట.

జ్యోతిష్యుల దగ్గర క్లారిటీ తీసుకున్న నయన్.. విఘ్నేష్ తో పెళ్లికి నో అంటోందట. ఆయన బలవంతం చేసిన వద్దని గట్టిగా చెబుతుందట. ఉన్నంత కాలం కలిసే ఉందాం. పెళ్లి.. గిల్లీ వద్దు. పెళ్లి చేసుకొని.. నేను నిన్ను దూరం చేసుకోలేను అని ఎమోషనల్ అవుతుందట. ఇప్పుడీ.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు.. విఘ్నేష్ తో పెళ్లి ఎప్పుడెప్పుడా ? అని ఎదురుచూసిన నయన్.. సడెన్ గా యూటర్న్ తీసుకోవడం.. ఆమె అభిమానులకి షాకినిస్తోంది. నయన్ జీవితంలో పెళ్లి భాగ్యం లేదన్న ఈ ప్రచారంలో నిజం కూడా కాకపోవచ్చేమో.. ! ఇది గాసిప్ రాయుళ్లు పనే అయితే ఎవరేం చేస్తారు.