తెలంగాణలో ‘రెడ్డి’ పార్టీ రాబోతుందా ?
తెలంగాణలో ఉద్యమకారులు, కేసీఆర్ వ్యతిరేకులు ఒక్కకాబోతున్నారు. తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకురానుందనే ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా జరుగుతోంది. ఇటీవల ఈటెల రాజేందర్ బర్తరఫ్ తర్వాత ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈటెల కొత్త పార్టీ పెడతారని.. అందుకోసం కసరత్తులు జరుగుతున్నాయనేది ప్రచారం. ఇదీ ప్రచారం మాత్రమే కాదు. నిజం కూడా.
దీనిపై మాజీ ఎంపీ కొండా స్పందించారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నది నిజమే అన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ లోని కీలక నేతలతో చర్చలు కూడా జరిపాం. ఇందులో ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నారని బాంబు పేల్చారు. కొత్త పార్టీ పెడితే.. కేసీఆర్ ని ఢీకొట్టగలమా ? లేక ఆయనకు లాభం చేకూర్చిన వాళం అవుతామా ? అనే ఆలోచనలు చేస్తున్నాం అన్నారు.
ఇంకా ఆయన ఓ అడుగు ముందుకేసి.. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, కోదండరామ్.. మరికొందరు కీలక నేతలతో కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. వాస్తవానికి.. విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి కొన్నాళ్ల క్రితం నుంచే కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ వస్తుందనే ఆశతో ఉన్నారు.
నిజంగానే విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగా.. రేవంత్ రెడ్డి, కోదండరామ్, ఈటెల తదితరులు కలిసి కొత్త పార్టీ పెడితే.. అది రెడ్డి పార్టీ అవుతుంది. అప్పుడు వీరు బీసీలకు ఎలా న్యాయం చేయగలరు ? ప్రస్తుతం తెలంగాణలో రావుల పెత్తనం నడుస్తోంది. వారికి చెక్ పెట్టడానికి రెడ్ల పార్టీ రాబోతుంది. మరీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసేదెవరు ? అందుకే తెలంగాణలో కొత్త పార్టీ రావాలి. అది బీసీల పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి ఈటెల కార్యరూపం దాల్చుతారా ? లేక ఇప్పటికే రెడ్డి ముద్ర వేసుకున్న.. ఆయన రెడ్ల పార్టీలో కీలక పాత్ర పోషిస్తారా ? అన్నది చూడాలి.