తెలంగాణలో లాక్ డౌన్.. రేపటి కేబినేట్ భేటీలో తుది నిర్ణయం ?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. పట్టణాల్లో మాత్రమే కాదు. పల్లెల్లోనూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్చంధంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నరు. మరోవైపు కరోనా ఉదృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం రేపు కేబినేట్ భేటీ జరగనుంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనసు మార్చుకొని లాక్ డౌన్ విధిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి.. రేపటి కేబినేట్ భేటీలో తెలంగాణలో లాక్ డౌన్ పై పూర్తి క్లారిటీ రానుంది. 

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.— Telangana CMO (@TelanganaCMO) May 10, 2021