‘శ్రీదేవి సోడా సెంటర్‌’ గ్లింప్స్‌

కరుణ కుమార్‌ దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘శ్రీ దేవి సోడా సెంటర్‌’. సుధీర్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు సుధీర్. 

‘పలాస’ తర్వాత కరుణ కుమార్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 80ల కాలం నాటి అమలాపురం నేపథ్యంగా సాగే ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనునంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు.