బ్రేకింగ్ : తెలంగాణలో పది రోజుల లాక్ డౌన్

పదిరోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ అధ్యక్షత తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది. ఈ భేటీ ప్రారంభమైన ఐదు, పది నిమిషాల్లోనే  లాక్ డౌన్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం విశేషం. 

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల షాపులు, కార్యకలాపాలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి కఠిన లాక్ డౌన్ ని అమలు చేయనున్నారు. ఈ ఉదయం కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రంజాన్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించరా ? అని ప్రశ్నించింది. ఐతే ఈ మధ్యాహ్నం కేబినేట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటారని ఏజీ తెలిపారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా కేబినేట్ లో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు.

మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది— Telangana CMO (@TelanganaCMO) May 11, 2021