అలర్ట్ : నాలుగు రోజుల్లో తుఫాన్

ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ తో వణికిపోతున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. మరో నాలుగు రోజుల్లో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి మయన్మార్ సూచించిన ‘తౌకతీ’ అని పేరు పెట్టనున్నారు.

మయన్మార్ లో దాని అర్థం బల్లి లేదా ఆ జాతికి చెందిన జీవి.ఈ తుపాను ప్రభావం దేశ పశ్చిమ తీరంలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 16 నాటికి తుపాను వస్తుందని, ఈ నెల 15–16 తేదీల మధ్య లక్షద్వీప్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయని హెచ్చరించింది. 

15న లక్షద్వీప్ కు చేరుకుని 16న తుపానుగా మరింత తీవ్ర రూపం దాలుస్తుందని తెలిపింది. మళ్లీ అది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. మహారాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాలు, గోవా, కర్ణాటక, కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.