ఈటెల.. స్కెచ్ అదిరింది !

ఈటెల రాజేందర్ కు సీఎం కేసీఆర్ చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అసైన్డ్ భూముల ఆక్రమణల వ్యవహారంలో ఆయన్ని మంత్రివర్గం బర్తరఫ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? ఇతర పార్టీలలో చేరుతారా ? లేక కొత్త పార్టీ పెడతరా ?? అన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు హుజూరాబాద్ లోనూ ఈటెలకు చెక్ పెట్టాలనే వ్యూహాంలో తెరాస ఉంది. టీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటెల ఇప్పటికే స్పష్టతనిచ్చారు. కరోనా పరిస్థితులు అదుపులోనికి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే తెరాస వర్గాలని ఏకం చేసే పనిలో.. మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు.

ఇక ఈటెల స్కెచ్ మరోలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తన నియోజకవర్గంలో బలం నిరూపించుకోవాలి. అదే సీఎం కేసీఆర్ కు చెంపపెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ఈటెల సూపర్ స్కెచ్ వేసినట్టు సమాచారమ్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజాపా, కాంగ్రెస్ లు పోటీ చేయకుండా ఈటెల పావులు కదుపుతున్నారట. 

మాజీ ఎంపీ కొండా విశ్వేశర్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, బీజేపీ ఎంపీ అరవింద్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తదితరులతో ఈటల భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనకు ఆయా పార్టీలు మద్దతు ఇచ్చే విధంగా ఈటల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాని వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోదు. ఈటెల గెలుపు ఈజీ అవుతుంది. మరీ.. ఈటెల కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ నుంచి తప్పుకుంటాయా ? అన్నది చూడాలి.