తారక్ హెల్త్.. మెగా అప్ డేటు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మొన్నే (సోమవారం) తారక్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. ‘కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్‌విజన్‌లోనే ఉన్నాం. నాతో కొద్ది రోజుల క్రితం వరకూ కలిసిన వారంతా టెస్టులు చేయించుకోండి. సేఫ్ గా ఉండండి’ అంటూ తారక్ ట్విట్ చేశారు. దీంతో తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. అభిమానులు, సినీ ప్రఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా తారక్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి అప్ డేట్ ఇచ్చారు. “కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. God bless తారక్” అంటూ చిరు ట్విట్ చేశారు. దీంతో తారక్ హెల్త్ పై మెగా అప్ డేటు వచ్చిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.