పుష్ప రెండు భాగాలు.. క్లారిటీ వచ్చేసింది !
బన్నీ-సుకుమార్’ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా రెండు భాగాల్లో రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో సుకుమార్ రెండు భాగాల ఆలోచన చేశారు. ఇంకా దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. పుష్పని రెండు భాగాలుగా తీసుకొస్తున్నామని తెలిపారు. ఐతే రెండు భాగాల ఆలోచన ఇప్పటిది కాదు. గత నవంబర్ లోనే అనుకున్నామని తెలిపారు.
ప్పుష్ప కథ కు అంత స్పాన్ వుంది. అంత భారీతనం వుంది. అంత బడ్జెట్ వుంది. దీని వల్ల అదనంగా లాభాలు వచ్చేస్తాయని కాదు. రెండు సినిమాలు రెండు బడ్జెట్ లు, అంతా దేనికదే. మొదటి భాగానిక సంబందించి చాలా వరకు వర్క్ పూర్తయింది. 110 రోజులకు పైగా షూటింగ్ జరిగింది. బోలెడు ఫుటేజ్ వుంది. భారీ ఫైట్లు, చేజ్ లు, పాటలు, ఐటమ్ సాంగ్ ఒకటేమిటి చాలా.పుష్ప రెండు పార్ట్ లు వన్ బై వన్ వరుసగా విడుదలవుతాయి. రెండో భాగం మొదటి భాగాన్ని మించి వుంటుంది. రెండు భాగాలుగా చేయడం వలన ఓ పాట అదనంగా చేరుస్తున్నాం. అదే ఐటమ్ సాంగ్. ఇది ఎవరితో అన్నది ఇంకా డిసైడ్ కాలేదని తెలిపారు.