భారత్‌లో కరోనా ఉద్దృతికి ఇతర కారణాలివే.. !

B.1.617 వైరస్‌ రకం చాలా ప్రమాదకరమైంది. ఇది భారత్ లో బాగా విస్తరిస్తోంది.B.1.617 వైరస్ రకంని భారత రకం స్ట్రైయిన్ అనే ప్రచారం కూడా మొదలైంది. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన ప్రమాదకర వైరస్‌ రకాల జాబితాలో బి.1.617ను కూడాడబ్ల్యూహెచ్‌వో చేర్చింది. ఈ స్ట్రెయిన్‌ వ్యాప్తి సాధారణ కరోనా వైరస్‌తో పోలిస్తే తీవ్రంగా ఉందని, చాలా దేశాల్లో ఈ రకం వల్ల కేసులు వేగంగా పెరిగాయని, అందుకే దీన్ని ఆందోళనకర జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. 

అంతేకాదు.. భారత్ లో కరోనా విజృంభణకు ఇతర కారణాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. కరోనాను మరిచి మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించడం, అక్కడ భౌతిక దూరం, మాస్క్‌ వంటి నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని అభిప్రాయపడింది.