సాయం చేసేందుకు ముందుకొచ్చిన రేణు

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. మాజీ హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గొప్ప మనసు చాటుకున్నారు. సామాజిక బాధ్యతను నడుంకట్టారు.

‘ఇనస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మీకు అవసరమైన సాయం నేను అందిస్తా, నా ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్ లో పెడతానని చెప్పారు. ఆర్థిక సాయం చేయలేను కానీ అవసరానికి ఆదుకుంటానని చెప్పారు. ప్లాస్మా అవసరం ఉన్నా, ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రిలో బెడ్స్ కావాలన్నా వెంటనే నాకు మెసేజ్ చేయండి, నా సర్కిల్ లో విచారించి వెంటనే సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నిజంగా అవసరం ఉన్నవారే తనను సంప్రదించాలి’ అని రేణు సూచించారు.