సీఎం కొడుకుతో శివాని రొమాన్స్
హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు హీరోయిన్స్ గా రాణించాలనుకుంటున్నారు. ఇప్పటికే దొరసాని సినిమాతో శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. పెద్ద కూతురు శివాని ఆ పనిలోనే ఉంది. ఈ క్రమంలో శివాని రాజశేఖర్ తమిళంలో ఓ క్రేజీ ఆఫర్ ను దక్కించుకుంది. హిందీలో సూపర్ డూపర్ హిట్ సాధించిన సందేశాత్మక చిత్రం ఆర్టికల్ 15 చిత్రం రీమేక్ లో శివాని రాజశేఖర్ కు అవకాశం వచ్చింది.
ఈ సినిమాలో తమిళనాడు నూతన సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించనున్నారు. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం శివాణి గృహన్ దర్శకత్వంలో ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ సినిమా చేస్తోంది. అలాగే తేజ సజ్జాతో మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.