ఆమిర్‌ సినిమాలో చైతూ.. ఆ టైమ్ వచ్చేసింది !

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’.1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. జూన్‌లో సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్‌ జరగనుంది. దీనికోసం చిత్రబృందం నెలరోజుల ముందుగానే లద్దాఖ్‌ వెళ్లనుంది.

‘వార్‌’ చిత్ర యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పర్వేజ్ షేక్‌ పర్యవేక్షణలో చిత్రీకరించనున్నారు. నాగచైతన్య కూడా ఈ షెడ్యూల్లోని కీలక సన్నివేశాల్లో పాల్గొననున్నారని సమాచారం. ‘లాల్ సింగ్ చద్దా’ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ 2020 మార్చిలో నిలిపివేశారు. ఇక క్రిస్మస్ కానుకగా సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో చిత్రబృందం ఉంది.