వేడి నీళ్లు కరోనాను చంపదట !

వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం ఉంది. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వేడి నీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడమనేది నిజం కాదని తెలిపింది. ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్‌ మరణిస్తుందని తెలిపింది.

వేడినీళ్లు తాగడం, వాటితో స్నానం చేయడం వల్ల కరోనా అంతం అవ్వడం మాట అటుంచితే.. శరీరానికి ఎంతోకొంత ఉపశమనం లభిస్తుందనేది వాస్తవం. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లునొప్పులు తగ్గుతాయి. మొదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా సరిగా అందుతుంది. అంతే.. కానీ వేడినీళ్లు కరోనాని చంపేస్తుందనే ప్రచారంలో నిజం లేదట. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.