దారుణం : ఆక్సిజన్ సాయం అడిగితే.. కోరిక తీర్చమన్నాడు !
మగాళ్లు.. మృగాళ్లు అని నిరూపించే ఘటన ఇది. ఆక్సిజన్ కావాలి అని వరుసకు సోదరుడైన ఓ వ్యక్తిని యువతి అడగ్గా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే.. తన కోరిక తీర్చాలి. తనతో శృంగారం చేయాలని డిమాండ్ చేశాడు.ఈ విషయాన్ని ఓ యువతి తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.
‘నా స్నేహితుడి చెల్లి తండ్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ సాయం చేయాలని పొరుగింటి వ్యక్తి, వరుసకు సోదరుడిని ఆమె అడిగింది. అందుకు అతను స్పందిస్తూ.. తనతో శృంగారం చేస్తే ఆక్సిజన్ సమకూర్చుతానని చెప్పాడు. అతని మాటలు విన్న ఆమె షాక్‌కు గురైంది అని ట్విట్ చేసింది.
దీనిపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిపై పోలీస్ కేసు పెట్టమని సలహాలు ఇస్తున్నారు. నిజంగానే సభ్య సమాజం తలదించుకొనే ఘటన ఇది. మగాళ్లు.. ఎక్కడైనా.. ఏ పరిస్థితుల్లోనైనా మృగాళ్లు అని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటున్నారు.
My friend’s sister like my baby sister was asked by a neighbour in an elite colony to sleep with him for an oxygen cylinder that she desperately needed for her father;
What action can be taken because the b* will obviously deny, no?#HumanityIsDead— Bhavreen Kandhari (@BhavreenMK) May 11, 2021