తేజని నిరాశపరిచిన కృతి

కృతి శెట్టి – ఉప్పెన సినిమాతో ఒక్క‌సారిగా బిజీ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్ముడు ఫుల్ బిజీ. కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక కొన్ని సినిమాలూ వ‌దులుకుంటోంది. తాజాగా తేజ‌కు సైతం నో చెప్పింది.

ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న చిత్రానికి తేజ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే స్క్రిప్టు ఓకే అయిపోయింది. క‌థానాయిక‌గా కృతి అయితే బాగుంటుంద‌నుకున్నారు. కానీ కృతి మాత్రం నో చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కూ అందుకున్న పారితోషికం కంటే… బెట‌ర్ ప్యాకేజీ ఇవ్వ‌డానికి చిత్ర‌బృందం రెడీ అన్నా స‌రే. కృతి ఒప్పుకోలేద‌ట‌.

వాస్తవానికి తేజ ప్రయోగాలు చేస్తాడు. వాస్తవికంగా సినిమాలు తీస్తాడు. దీంతో హీరో-హీరోయిన్స్, మిగితా నటులకు నటనకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. తేజ కొత్తవారితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆ కారణంతోనే కృతిపై ఇష్టం పెంచుకున్నారు. ఆమె మాత్రం తేజని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం తేజ మరో హీరోయిన్ వేటలో పడినట్టు తెలుస్తోంది.